జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత! PDF Print E-mail
(average 0 out of 5)
 
నందమూరి యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై అడ్డు తొలిగింది. జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై దాఖలైన పిటిషన్‌ను లీగల్ సర్వీసెస్ అథారిటీ శనివారం తోసిపుచ్చింది.

మైనర్ బాలికతో జూనియర్ ఎన్టీఆర్ వివాహం తలపెట్టడం సబబు కాదంటూ కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ(లీగల్ సర్వీసెస్ అథారిటీ)లో మచిలీపట్నానికి చెందిన న్యాయవాది శింగలూరి శాంతిప్రసాద్ శుక్రవారం ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్‌ను విచారించిన లీగల్ సర్వీసెస్ అథారిటీ.. ఈ పిటిషన్‌ను కొట్టిపారేసింది.

ఈ నేపథ్యంలో.. జూనియర్ ఎన్టీఆర్ వివాహం చేసుకోబోతున్న లక్ష్మీ ప్రణీత మైనర్ కాదని మేజర్ అని శనివారం నన్నపనేని రాజకుమారి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై బురద జల్లడానికి కొంత మంది కుట్ర పన్నుతున్నారని నన్నపనేని ఆరోపించారు. లక్ష్మీ ప్రణీత తనకు చిన్ననాటి నుంచి తెలుసునని, ఆమె మేజర్ అని నన్నపనేని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే... జూనియర్ ఎన్టీఆర్, స్టూడియో ఎన్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిల వివాహ నిశ్చితార్థం మార్చి 18న జరుగనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారైనట్లు ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలిసింది. మే లేదా జూన్ నెలలో వివాహం జరిపే ఆలోచనలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

Source: WebDunia



Add this page to your favorite Social Bookmarking websites
 

Add comment

Security code
Refresh